ఆమె మహేష్ అమ్మ పాత్రలో..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ థర్డ్ షెడ్యూల్ జులై నుంచి జరుగుతుందనే ప్రచారం నడుస్తోంది. అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమాలోకి క్యాస్టింగ్ విషయంలో త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన పాత్రల కోసం నటులని ఎంపిక చేయాలేదంట.

ఇది కూడా సినిమా ఆలస్యానికి ఒక కారణం అనే మాట వినిపిస్తోంది. అయితే ఫైనల్ గా క్యాస్టింగ్ అంతా ఒక కొలుక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాలలో బలమైన ఫిమేల్ క్యారెక్టర్ ఒకటి కచ్చితంగా ఉంటుంది. దానికోసం స్టార్ యాక్టర్స్ ని తీసుకుంటారు. అత్తారింటికి దారేది సినిమా నుంచి ఇదే శైలి ఫాలో అవుతున్నారు.

అలాగే గుంటూరు కారం మూవీలో కూడా మహేష్ బాబు తల్లి పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందంట. బాహుబలి సిరీస్ తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరోసారి ఇండియా మొత్తం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యారు. ఆమెకి స్టార్ ఇమేజ్ వచ్చింది. అయితే ప్రస్తుతం రమ్యకృష్ణ సెలక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకొని చేస్తోంది.

చివరిగా రంగమార్తాండ మూవీతో రమ్యకృష్ణ ప్రేక్షకులని అలరించింది. ప్రకాష్ రాజ్ సతీమణి పాత్రలో ఆమె తన నట విశ్వరూపం చూపించారని చెప్పాలి. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారంలో మహేష్ బాబు తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణని తీసుకున్నారంట. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటే చేయని వారు ఉండరు.

అలాగే రమ్యకృష్ణ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తోన్న సంగతి తెలిసిందే. మెయిన్ క్యాస్టింగ్ ఖరారు కావడంతోత్వరలో అఫీషియల్ గా షూటింగ్ పై అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. మరి రమ్యకృష్ణ, మహేష్ బాబు మధ్య తల్లి, కొడుకుల బాండింగ్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది.