కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విశాల్ కి తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ఇక ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటాయి.ఇలా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విశాల్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో పడ్డారంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది.అనంతరం ఈయన మరొక అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకొని చివరి నిమిషంలో తన వివాహాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం తాను ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని త్వరలోనే తన ఎవరో తెలియచేస్తానంటూ ఈయన తన ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఇకపోతే తాజాగా విశాల్ తన ప్రేమ గురించి చేసుకోబోయే అమ్మాయి గురించి చిన్న హింట్ ఇచ్చారు. తనకు అరేంజ్డ్ మ్యారేజ్ అచ్చి రాలేదని అందుకే తాను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఈయన తన ప్రేమ గురించి బయటపెట్టారు. అయితే ఈయన హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నారని కోలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ఆంటోనీ సినిమాలో భార్యాభర్తలు గా నటించడంతో నిజ జీవితంలో కూడా వీరిద్దరూ భార్యాభర్తలుగా కావాలని కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే ఈయన తప్పనిసరిగా ప్రేమ వివాహమే చేసుకుంటానని అయితే ఆ వివాహం కూడా ఎప్పుడు చేసుకుంటానో తెలియజేశారు. ప్రస్తుతం తను యాక్టర్స్ యూనియన్ కోసం బిల్డింగ్ కడుతున్నానని అది పూర్తి కాగానే తన పెళ్లి చేసుకుంటానని తెలిపారు.ఇక ఆ బిల్డింగ్ పూర్తి కావడానికి సుమారు మూడు సంవత్సరాల సమయం పడుతుందని ఇలా మూడు సంవత్సరాల తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ చెప్పడంతో విశాల్ పెళ్లి కోసం మరో మూడు సంవత్సరాలు ఎదురు చూడాలా అంటూ అభిమానులు సంతోషంలో కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.