భార్య వేధింపులు తాళలేక ఒక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఒకసారి చూద్దాం. బెంగళూరులోని ఒక కంపెనీలో ఐటీ డైరెక్టర్ గా పని చేస్తున్న అతుల్ తో అతని భార్య గొడవ పడి యూపీలోని పుట్టింటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యతో కలిసి ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు అతుల్ . కోర్టు వాయిదాల కోసం బెంగళూరు నుంచి యూపీకి కనీసం 40 సార్లు వచ్చాడు.
కోర్టు కూడా భార్యకే సపోర్ట్ చేయడంతో నిస్సహాయ స్థితిలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు 24 పేజీల సూసైడ్ నోట్ తో పాటు తాను ఎందుకు చనిపోతున్నది కోర్టులో తను ఏ విధంగా అవమానించబడ్డది అన్నీ వీడియో రూపంలో చెప్పి మరీ చనిపోయాడు. తన చావుకి తన భార్య నికిత సింఘానియా, అత్త నిషా సింఘానియా, భార్య సోదరుడు అనురాగ్ సింఘానియా, భార్యకి బాబాయ్ సుశీల్ సింగానియా కారణం అని ఆరోపించాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది.
ఇలాంటి అన్యాయం ఒక మగవాడికి జరిగింది కాబట్టి ఎవరు ఏమీ స్పందించడం లేదు అదే ఒక స్త్రీకి ఇలా జరిగి ఉంటే ఈపాటికి స్త్రీవాదులందరూ రచ్చ చేసేవారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై బాలీవుడ్ నటి కంగనా రౌనత్ స్పందించింది. నిజంగా ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. అతడి ఆర్థిక శక్తికి మించి అతడి దగ్గర నుంచి కోట్ల రూపాయలు దోచుకున్నారు.
తీవ్ర ఒత్తిడి వలన ఆ వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి విషయంలో ఆయన భార్య తప్పుగా ప్రవర్తించి ఉండవచ్చు కానీ అందరి ఆడవాళ్ళని అలా అనలేము ప్రస్తుతం విఫలమవుతున్న పెళ్లిళ్లలో 99% మంది మగవాళ్ళదే తప్పు. అందుకే అతని విషయంలో తప్పుగా జరిగి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మగవాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.