‘హరి హర వీర మల్లు’ తాత్కాలిక వాయిదా.?

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీర మల్లు’ సినిమాకి తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రస్తుతానికైతే సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగులో పవన్ కళ్యాణ్ బిజీగా వున్న సంగతి తెలిసిందే. రోజుకి రెండు కోట్లు.. మొత్తంగా 25 రోజులు.. వెరసి యాభై కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు కూడా.

ఇంతకీ, ‘హరి హర వీరమల్లు’ సంగతేంటి.? ‘సైమల్టేనియస్‌గా సినిమా షూటింగ్ జరుగుతోంది’ అన్న ప్రచారం జరుగుతున్నా, అది నిజం కాదుట. తాత్కాలిక విరామాన్ని ఆ సినిమా షూటింగుకి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

త్వరలో ‘ఓజీ’తోపాటు, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమల షూటింగులూ షురూ అవబోతున్నాయ్. అవి కూడా శరవేగంగానే జరుగుతాయట. ‘హరిహర వీరమల్లు’ విషయంలోనే క్లారిటీ రావడంలేదు. తాత్కాలిక విరామమా.? లేదంటే, ఇంకేదన్నా వినకూడని అంశం వుందా.?