విదేశాలలో త్రివర్ణ పతాకంతో సందడి చేసిన స్టార్ కపుల్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీ లో లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవల తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం మూడుములతో ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ స్పెయిన్‌లోని బార్సిలోనా విధుల్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలు విషయం ఏమిటంటే.. ఆగష్టు 15 వ తేదీన భారత దేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసినా కూడా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ దేశం పట్ల తమకున్న అభిమానాన్ని చాటి చెబుతున్నారు. అయితే స్పెయిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార దంపతులు కూడా తమ దేశం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటిచెప్పారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ జాతీయ జెండాని చేత పట్టుకొని స్పెయిన్ వీధుల్లో తిరుగుతూ దేశం పట్ల తమకి ఉన్న అభిమానాన్ని తెలియచేశారు. ఇటీవల ఆగస్టు 15వ తేదీన సోమవారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భారతీయులు ఘనంగా జరుపుకుంటు హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో భారత్ లోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసారు.

అయితే ఎక్కడో ఉన్న స్పెయిన్‌లో నయన్‌, విగ్నేష్ ‌దంపతులు కూడా భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ప్రదర్శించి భారతీయులమని గర్వంగా చెప్పుకున్నారు. స్పెయిన్ వీధుల్లో జాతీయ పతాకాన్ని పట్టుకొని తిరిగిన వీడియోని నయనతార సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోమవారం మొత్తం ఈ జంట ఎక్కడికి వెళ్లినా జాతీయ పతాకాన్ని చేత పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ గ్రామంలో ఇటీవల నయనతార ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. అంతేకాకుండా జాతీయ పతాకంతో నయనతార దంపతులు దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా విదేశాలలో ఉన్నప్పటికీ స్వాతంత్ర దినోత్సవం రోజున మన జాతీయ పతాకాన్ని ఎగరేస్తూ దేశం పట్ల తమకున్న అభిమానాన్ని చాటి చెప్పటంతో నయనతార దంపతులపై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.