కృష్ణ నాగార్జున మధ్య గొడవలు గురించి క్లారిటీ ఇచ్చిన సీనియర్ జర్నలిస్ట్.. అందుకే అంత్యక్రియలకు దూరంగా ఉన్నారా?

సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 15వ తేదీ తుది శ్వాస విడిచారు. ఈయన శరీరం పూర్తిగా వైద్యానికి సహకరించకపోవడంతో ఆయనని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని వైద్యులు కూడా తనకు వైద్యం అందించలేదని ఇలా తన శరీరంలో ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం వల్లే కృష్ణ చనిపోయారని వైద్యులు వెల్లడించారు. ఈ విధంగా ఈయన నవంబర్ 15 మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.ఈ విధంగా కృష్ణ మరణించడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలో తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. అయితే కృష్ణ అంత్యక్రియలకు నటుడు నాగార్జున దూరంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే నాగార్జున అంత్యక్రియలకు రాకపోవడానికి గల కారణం ఏంటని ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయి అంటూ పలువురు ఆరా తీశారు. ఈ క్రమంలోనే నాగర్జున కృష్ణా మధ్య విభేదాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ క్లారిటీ ఇచ్చారు. నాగార్జున కృష్ణ కలిసి పలు సినిమాలలో నటించారు.దేవదాసు సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చిన కృష్ణ మరోసారి ఆ విషయాల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ వారసుడు సినిమాలో నటించారు.

ఈ సినిమా విషయంలో కూడా వీరిద్దరి అభిమానుల మధ్య గొడవ చోటుచేసుకుంది.ఈ సినిమాలో కృష్ణ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందని ఈయన పాత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదని అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకున్నప్పటికీ ఆ గొడవ హీరోల వరకు వెళ్లలేదు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ రాముడోచ్చాడు అనే సినిమాలో కూడా నటించారు. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకపోయినప్పటికీ నాగార్జున అంత్యక్రియలకు రాకపోవడానికి గల కారణం ఆయన బిజీగా ఉండి ఇండియాలో లేకపోవడమే కారణమని అంతకుమించి వీరి మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు లేవు అంటూ సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ క్లారిటీ ఇచ్చారు.