ఓటీటీలలో వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని సిరీస్ స్క్విడ్ గేమ్. ఓటీటీల విూద కొద్దిగా అవగాహన ఉన్నవారు కూడా దీని పేరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. మనీ హెయిస్ట్, స్ట్రేంజర్ థింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ వంటి ఫాలోయింగ్ ఈ సిరీస్‌కు కూడా ఉంది.
2021 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్టయింది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. ఇక ఈ సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రే క్షకులకు బాగానే చేరువైంది. కాగా..ప్రస్తుతం స్క్విడ్ గేమ్‌కు సెకండ్ సీజన్ రెడీ అవుతోంది.
అయితే, తాజాగా ఈ సెకండ్ సీజన్‌కు సం బంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ అనే పేరుతో రానున్న ఈ సెకండ్ సీజన్‌కు సంబంధించి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో వి4.56 మిలియన్ల ప్రైజ్ మనీ కోసం 456 మంది రియల్ పీపుల్ పోటీ పడుతున్నట్లు టీజర్ చూపిస్తుంది. నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.