కోట్లు కొల్లగొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసిన “జల్సా” రీ రిలీజ్ ..ఎంత వసూలు చేసిందంటే?

గతంలో విడుదలయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ చేయటం ఒక ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి కెరీర్ లో ద బెస్ట్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాని థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రీ రిలీజ్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన తమ్ముడు, జల్సా సినిమాలను రిలీజ్ చేశారు. దీంతో జల్సా సినిమ కి భారీ ఆదరణ లభించటమే కాకుండా కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది.

ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ముందుండి మరి జల్సా సినిమాకి స్పెషల్‌ షోస్‌ వేయించారు. ఈ సినిమా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు థియేటర్లలో ప్రదర్శించారు. అయితే ఇలా రీ రిలీజ్ చేసిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసిన జల్సా సినిమా ఒక్కరోజులో రూ.3.20కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల విడుదలైన కొత్త సినిమాలు కూడా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా రీ రిలీజ్ చేసిన తర్వాత కూడా భారీ స్థాయిలో వసూలు సొంతం చేసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఇప్పటి వరకు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక కొత్త రికార్డుగా పరిగణించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కి ఉన్న క్రేజ్‌ ఇమేజ్‌ వల్ల భారీ స్థాయిలో వసూలు సొంతం చేసుకుని యువతలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ కి నిదర్శనంగా నిలిచింది. సినిమా రీ రిలీజ్ చేసిన ఒకే రోజులో ఈ స్థాయి కలెక్షన్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారిగా విడుదలైన జల్సా సినిమాకు చేసినంత హంగామా చేశారు. ఈ సినిమా చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద ఎగబడి మరీ సినిమా చూసారు.