ఓజీలో పవన్ కళ్యాణ్ తెరపై కనిపించేదెంత సేపు.?

‘బ్రో’ సినిమా మల్ట్టీ స్టారర్ మూవీ. సో, కొంత సేపు పవన్ కళ్యాణ్ స్ర్కీన్‌పై కనిపించకపోయినా ఏమంత ఫరక్ పడదు. కానీ, ‘ఓజీ’ విషయానికి వస్తే, అది కుదరదు. సినిమా అంతా పవన్ కళ్యాణ్ కనిపిస్తూనే వుండాలి. ఏవో కొన్ని కొన్ని సన్నివేశాలు తప్ప.. హీరోగా మ్యాగ్జిమమ్ స్పేస్ పవన్‌దే అయ్యుండాలి.

అయితే, ‘ఓజీ’ షూటింగ్ పవన్ లేకుండానే జరిగిపోతోంది. ఇదే పలు రకాల అనుమానాలకి తావిస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వున్న పరిస్థితుల్లో ఆయన సినిమాల ప్యాటర్న్ కూడా మారిపోయింది. వాటిని దృష్టిలోకి తీసుకుంటే, ఇంకా అనుమానాలు తలెత్తుతున్నాయ్.

పవన్ లేకుండానే జరుగుతున్న ‘ఓజీ’ షూటింగ్ షాట్స్ నేపథ్యంలో ఆ అనుమానాలు మరింత పెరుగుతున్నాయ్ ఇటు అభిమానుల్లోనూ, అటు సినీ వర్గాల్లోనూ కూడా.

ఈ అనుమానాల్ని నివృత్తి చేసే దిశగా ‘ఓజీ’లో ఇతర పాత్రధారులైన అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించబోతున్నారనీ, కొత్త పవన్ కళ్యాణ్‌ని చూడబోతున్నారనీ చెబుతున్నారు. అయినా కానీ, నమ్మకం కలగట్లేదు. సినిమాలు రిలీజైతే కానీ ఆ అనుమానాలకు చెక్ పడదు.