ఈ మధ్యకాలంలో తమ టాలెంట్ ని నమ్ముకొని ఎంతోమంది షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో వచ్చిన గుర్తింపుని తలకెక్కించుకొని చాలామంది తప్పటడుగులు వేస్తున్నారు. అందుకు ఉదాహరణగా చాలామంది యూట్యూబర్స్ చేసిన తప్పులకి జైలు వరకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరొక యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యాడు. అతనే ప్రసాద్ బెహరా.
యూట్యూబ్లో అతను చేసిన మావిడాకులు, పెళ్ళివారమండి వంటి సిరీస్ లో ఫేమస్ కావడంతో కమిటీ కుర్రాళ్ళు సినిమాలో అవకాశం దక్కింది. ఆ సినిమాలో అతని నటనకి మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే తాజాగా
సహచర నటిని వేధించిన కేసులో ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. మణికొండ కు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ పై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రసాద్ ని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని చంచల్ గూడా జైలుకి తరలించారు. అసలు ఏం జరిగిందంటే..
ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఒక హీరోయిన్ ప్రసాద్ పై ఫిర్యాదు చేసింది. పెళ్ళివారమండి అనే వెబ్ సిరీస్ సమయంలో ప్రసాద్ బెహరా తో పరిచయమైందని ఆ సమయంలో కూడా అతను చాలా సార్లు ఇబ్బంది పెట్టాడని అయితే ప్రసాద్ క్షమాపణలు చెప్పటంతో ఊరుకున్నానని కానీ ఈ సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత మెకానిక్ అనే మరో వెబ్ సిరీస్ లో ఇద్దరు కలిసి నటించారని అప్పుడు కూడా ప్రసాద్ ఇలాగే ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చింది.
అయితే ఇటీవల షూటింగ్ సమయంలో అందరి ముందు ప్రసాద్ తన బ్యాక్ పై కొట్టాడని ఎందుకు కొట్టావు అని అడిగితే ఏదో జోక్ చేసినట్లు అందరి ముందు నవ్వడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తరువాత తనపై ఇష్టం వచ్చినట్లు వల్గర్ కామెంట్లు చేసినట్లు బాధితురాలు చెప్పింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్తే ప్రసాద్ నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే సదరు ప్రసాద్ కి ముందే పెళ్లి అయిందని, ఆ పెళ్లి పెటాకులు అయిందని తెలిసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.