పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అయితే ఊహించని స్థాయిలో మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. అయితే సినిమాకు అనుకున్నంత స్థాయిలో మాత్రం పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. కేవలం పవర్ స్టార్ క్రేజ్ వల్లనే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఓవైపు పెద్దగా టికెట్ల రేట్లు కూడా పెంచలేదు. అలాగే బెనిఫిట్ షోల హడావిడి కూడా కనిపించలేదు.
అయినప్పటికీ కూడా సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా 50 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అయితే అందుకుంది. కానీ మొత్తంగా బాక్సాఫీస్ వద్ద అనుకున్న టార్గెట్ ప్రకారం అయితే 98 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అయితే వెనక్కి తేవలసి ఉంది. అంటే దాదాపు ఇంకా 45 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ వెనక్కు తేవాలి.
అయితే ఆదివారం వరకు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక సోమవారం బ్రో సినిమా అసలు టైం అయితే స్టార్ట్ కానుంది. నార్మల్ డేస్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అనే దాని పైనే రిజల్ట్ ఆధారపడి ఉంది. సోమవారం కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గినా కూడా బ్రో సినిమా చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంది. మరి సినిమా ఎలాంటి వసూళ్ళను సాధిస్తుందో చూడాలి.