అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఈయన మొదటిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి ఈయన ఈ సినిమాలో నటించారు.ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు సినీ కెరియర్ గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 13 సంవత్సరాలు కావడంతో ఈయన తన సినీ కెరియర్ గురించి ప్రస్తావించారు.తాను ఇండస్ట్రీలోకి వచ్చి 13 సంవత్సరాల అవుతుందని, ఇది తనకు ఒక అద్భుతమైన ప్రయాణం అని తెలిపారు. ఈ 13 సంవత్సరాల జర్నీ తనకు ఎన్నో రకాల ఎమోషన్స్ ను నేర్పించిందని, ఎప్పటికప్పుడు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని ఈయన తెలిపారు.అన్ని విషయాలు నాకు క్లారిటీగా తెలుసని చెప్పలేను కానీ నటుడిగా నాకంటూ ఓ క్లారిటీ ఉందని ఈ చిత్ర పరిశ్రమ తనకు ఎన్నో నేర్పించిందని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.
ఇకపోతే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఈయన మొదటిసారిగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రస్తావించారు.సినిమా కంటే ఈయన వ్యక్తిగత జీవితాల గురించే ఎక్కువగా ప్రశ్నలు ఎదురవడంతో ఒకానొక సందర్భంలో తనకు విసుగు కూడా వచ్చిందని చైతన్య చెప్పడం గమనార్హం.ఏది ఏమైనా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నామని ఈయన తెలిపారు.