ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన కూడా కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. కానీ మంచి కంటెంట్ తో చిన్న హీరోలు నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అందుకు ఉదాహరణ ఇటీవల విడుదలైన సీతారామం సినిమా. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై ఊహించని విధంగా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో తెలుగు ఇండస్ట్రీ తో సంబంధంలేని మలయాళీ నటుడు హీరోగా నటించినప్పటికీ సినిమాలో మంచి కంటెంట్ ఉండడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాని హిట్ చేశారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక సీన్ మల్లేశ్వరి సినిమా సీన్ ని కాపీ కొట్టినట్లు నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అను ఈ విషయం గురించి స్పందిస్తూ… వేరొక సినిమాలో సీన్ కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు. లవ్ ప్రపోజల్ సీన్ ని చాలా సింపుల్ గా చూపించాలన్న ఉద్దేశంతో ఆ సీన్ చేసామని హను వెల్లడించాడు.
అంతేకాకుండా మల్లేశ్వరి వంటి గొప్ప సినిమాతో తన సినిమాని పోల్చినందుకు చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. ఇక ఈ సందర్భంగా ఈ సినిమా హీరో విషయంలో వచ్చిన రూమర్ల గురించి కూడా రాఘవపూడి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం మొదటగా నాని, విజయ్, రామ్ వంటి హీరోలను సంప్రదించాడని కానీ వారు ఈ స్టోరీ రిజెక్ట్ చేయడంతో దిల్కర్ తో కలిసి ఈ సినిమా చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తల గురించి స్పందించిన రాఘవపూడి మొదటగా దుల్కర్ సల్మాన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టోరీ రాశానని ఆ ముగ్గురు హీరోలను కలవడానికి వేరే కారణం ఉందని రాఘవపూడి వెల్లడించాడు.