ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల అయ్యి సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు బద్దలు కొట్టిన ఈ సినిమా తాజా కలెక్షన్స్ లోనూ చరిత్ర సృష్టిస్తుంది. మొదటి రోజు కలెక్షన్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాని బీటౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణతో, మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఆంధ్రాలో మాత్రం కాస్త వెనకబడినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకి టికెట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది అని కొందరు అంటున్నారు. టికెట్టు ధరలు ఎక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాలలో అల్లు అర్జున్ అభిమానులు సైతం ప్రీమియర్ షోలలో సినిమాని వీక్షించేందుకు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ఎనిమిది వందల రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుక్కొని మూవీ చూడటానికి ఆడియన్స్ ఇబ్బంది పడినట్లు సమాచారం. ఆ ఇంపాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా కనిపిస్తుంది.
అయితే మరో వర్గం వారు మాత్రం పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందులోని గోదావరి జిల్లాలలో బాయ్ కట్ చేయడం వలన కలెక్షన్స్ తగ్గాయి అంటున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ వర్గం వారు ఈ సినిమాపై ఎలాంటి పక్షపాతం చూపించకుండా నార్మల్గానే ఉన్నారు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్, జనసేన కూడా తోడవడంతో ఏపీలో పుష్ప టు కలెక్షన్స్ మీద ప్రభావం చూపించానటంలో ఏమాత్రం సందేహం లేదు.
ఎప్పుడైతే బన్నీ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా అతని ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడో అప్పటి నుంచే పవన్ ఫ్యాన్స్ బన్నీని మెల్లమెల్లగా దూరం పెట్టడం ప్రారంభించాయి. ఎన్నికల తరువాత పవన్ చరిష్మా మరింత పెరగటంతో ప్రభావం అల్లు సినిమాపై గట్టిగానే పడింది. టికెట్లు రేట్లు తగ్గించాక కూడా ఏపీలో పుష్ప 2 సినిమా నిలదొక్కుకోకపోతే సినిమా పరాజయానికి కారణం చరిష్మా అని చెప్పుకోవడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.