హీరో లా ఉన్న సంతోషం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్..!

సాధారణంగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఎంతోమంది పెరిగి పెద్దయిన తర్వాత హీరో హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఇలా ఇప్పటికి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందిన వారు పెరిగి పెద్దయి ఇండస్ట్రీలో నటీ నటులుగా మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలో సంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అక్షయ్ కూడా పెరిగి పెద్దయిన తర్వాత ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాలో అక్షయ్ నాగార్జున కొడుకుగా నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించగా..గ్రేసీ సింగ్, శ్రీయ శరణ్ హీరోయిన్లుగా నటింqచారు. ఇక ఈ సినిమాలోప్రముఖ సినీ రచయిత, దర్శకుడు అయిన కె విశ్వనాథ్ గారు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా ప్రముఖ పాత్రలో నటించాడు. ఈ సినిమా 2002లో విడుదలై సక్సెస్ ఫుల్ గా 100 రోజులు ఆడింది. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అక్షయ్ తన క్యూట్ డైలాగులు, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను నవ్వించిన అక్షయ్.. నాగార్జునతో పాటు ఎమోషనల్ సన్నివేశాలలో కూడా నటించి ఆకట్టుకున్నాడు.

ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన మాస్టర్ అక్షయ్ ప్రస్తుతం పెరిగి పెద్దయి నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. అక్షయ్ ప్రస్తుతం సినిమాలలో నటించటమే కాకుండా అనేక కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అక్షయ్ నటుడిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా తనలో మంచి టాలెంట్ ఉంది. అక్షయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, సింగింగ్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అక్షయ్ లేటెస్ట్ ఫోటోలో చూసిన నెటిజన్స్ అచ్చం హీరోల ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.