Pushpa 2: బెస్ట్‌ మాస్టర్‌ పీస్‌ ఎపిసోడ్‌ గంగమ్మ జాతర హైలెట్‌ అవుతుంది

Pushpa 2: టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం ‘పుష్ప ది రూల్‌’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప’ నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత రవిశంకర్‌ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు.

Pushpa 2: డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు సిద్దమైన పుష్ప పార్ట్ 2: ది రూల్

అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసం గత 2 ఏండ్ల నుంచి పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతో కష్టపడి పని చేశాడు. అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ మూవీ అవుతుంది. ఇది కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది.

Pushpa 2

అలాగే ఈ సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్‌ దాదాపు 35 రోజుల పాటు జరిగింది. ఈ మూవీలోనే బెస్ట్‌ మాస్టర్‌ పీస్‌ ఎపిసోడ్‌ అవుతుంది. అలాగే పుష్ప 2 (Pushpa 2) షూటింగ్‌ ఐటెం సాంగ్‌తో సహా నవంబర్‌ 5వ తారీఖుకి పూర్తవుతుంది. ఆ నమ్మకంతోనే మొదట ప్రకటించినదానికంటే ఒకరోజు ముందుగా డిసెంబర్‌ 5 రిలీజ్‌ అని ప్రకటించాం అంటూ నిర్మాత తెలిపారు.

బాబుకి షర్మిల చంచాగిరి | Perni Nani Shocking Comments On Ys Sharmila | Ys Jagan | Chandrababu | TR