Beast Movie: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈ నెల 13వ తేదీ విడుదలయింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేదని చెప్పాలి.మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత రోజులలో భారీ కలెక్షన్లను కోల్పోయింది. ఇకపోతే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ ఎత్తున నష్టాలు వచ్చాయని చెప్పాలి.
ఇలా ఈ సినిమా ప్లాప్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం అవేమీ పట్టవు అన్నట్టుగా పెద్దఎత్తున పార్టీలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ దళపతి చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కొంతమేర ఆశ్చర్యానికి లోనయ్యారు. సాధారణంగా ఎవరైనా సినిమా ఫ్లాపయితే ఆ సినిమాలో ఉన్న లోపాలు ఏమిటి గుర్తించి తదుపరి సినిమాలకు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ బీస్ట్ చిత్రబృందం మాత్రం
పార్టీలు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక పోతే ఈ ఫోటోలు చూసిన డిస్ట్రిబ్యూటర్లు కొంతమేర చిత్రబృందం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలతో అధిక మొత్తంలో సినిమా కొని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇవేమీ పట్టవు అన్నట్టుగా మీరు మాత్రం పార్టీలు చేసుకుంటున్నారు అంటూ డిస్ట్రిబ్యూటర్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్ల సైతం ఈ విషయంపై మండిపడుతూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.