విజయ్ ఆంటోని అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్ట లేకపోయినా బిచ్చగాడు హీరో అంటే మాత్రం అందరికీ ఆయన పిక్చర్ కనపడుతుంది.తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా బిచ్చగాడు సినిమాతో తెలుగులో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈయన అనంతరం తాను నటించే సినిమాలన్నింటినీ కూడా తెలుగులో డబ్ చేస్తూ విడుదల చేస్తున్నారు.ఇలా హీరోగా తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ ఆంటోని తన చిన్నతనంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అలాగే తన పెళ్లి గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చిన్న వయసులో ఉన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో అన్ని కష్టాలను తాను చూసానని ఆ కష్టాలే తననీ ఈ స్థాయిలో నిలబెట్టాయని ఈయన వెల్లడించారు. ఇలా ఎన్నో కష్టాలను అనుభవించి చదువు పూర్తి చేసుకున్న తర్వాత అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నానని పేర్కొన్నారు.
తన పెళ్లి గురించి విజయ్ ఆంటోని మాట్లాడుతూ… తన పెళ్లి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసిందని తెలిపారు.సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లను జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే విజయ్ ఆంటోనీని ఫాతిమా అనే జర్నలిస్టు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇలా తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్టుతో ప్రేమలో పడిన విజయ్ ఆంటోని తనని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న యాంకర్ ఫాతిమాతో కలిసి విజయ్ ఎంతో సంతోషంగా తన వైవాహిక జీవితంలో గడుపుతున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.