NBK 107: NBK 107 సెట్ లో సందడి చేసిన అఖండ డైరెక్టర్… ఫోటో వైరల్!

NBK 107: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నేటి హీరోలకు పోటీగా ఇండస్ట్రీలో దూసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే బోయపాటి శీను దర్శకత్వంలో ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన అఖండ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నేడు వంద రోజుల వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.ఇకపోతే అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా నుంచి విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్యతో పోటీ పడటం కోసం కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించేందుకు ఎంపిక కాగా, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ లొకేషన్ కి అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను వెళ్లినట్లు తెలుస్తోంది.NBK107 సెట్స్‌ని సందర్శించి, టీమ్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. మేకర్స్ పవర్ ఫుల్ త్రయానికి సంబంధించిన పిక్ ను పంచుకోగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి కూడా ఎస్.ఎస్ తమన్ సమకూరుస్తున్నారు.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ లు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.