ప్రపోజల్ ఫోటో షేర్ చేసిన అతిథి రావు హైదరీ.. థాంక్యూ 2024 అంటూ ట్యాగ్ లైన్!

ఈ మధ్యనే దంపతులైన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిధిరావు హైదరీ ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మొదటిసారి మహాసముద్రం సినిమా కోసం పనిచేశారు.ఆ సినిమాలో మెయిన్‌ హీరోగా శర్వానంద్‌ నటించగా, మరో హీరో పాత్ర లో సిద్దార్థ్‌ నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా జీవితంలో కొత్త తోడు ను సిద్దార్థకు ఇచ్చింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొన్నేళ్లుగా సహజీవనం సాగించిన వీళ్లు ఈ మధ్యనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. వాళ్ల రిలేషన్‌ గురించి అదితి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘మహా సముద్రం’ షూట్‌లో తమ మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది. కొంతకాలానికి అది స్నేహంగా మారిందని చెప్పింది. తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్‌ తనకు ప్రపోజ్‌ చేశాడని చెప్పింది. నాన్నమ్మ అంటే తనకెంతో ఇష్టమనీ హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్‌ స్థాపించారనీ అది తన కెంతో ప్రత్యేకమని అదితి తెలిపింది.

తన చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపినట్లు చెప్పింది. కొన్నేళ్లక్రితం నానమ్మ కన్నుమూశారనీ ఈ విషయం తెలిసిన సిద్ధార్థ్‌ ఓ రోజు తన వద్దకువచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడట. మార్చిలో తామిద్దరం అక్కడికి వెళ్లామనీ మోకాళ్లపై కూర్చొని సిద్ధార్థ్‌ తనకు ప్రపోజ్‌ చేశాడనీ చెప్పుకొచ్చింది అదితి. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్‌ చేసినట్లు చెప్పాడని అదితి అంది.

అయితే తాజాగా ఈమె న్యూ ఇయర్ సందర్భంగా సిద్ధార్థ తనని ప్రపోజ్ చేసిన ఫోటోతో పాటు అతనితో గడిపిన క్షణాలని ఎంగేజ్మెంట్ ఫోటోలని పెళ్లి ఫోటోలని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. థాంక్యూ 2024 వెల్కమ్ 2025 అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ఈ పెళ్లి వీళ్ళిద్దరికీ రెండో పెళ్లి కావటం గమనార్హం.