తెలుగింటి వంటలపై మనసు పారేసుకున్న నటి.. బిర్యాని అంటే చాలా ఇష్టం!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రాశిఖన్నా.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.నిజానికి ఈమె నార్త్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ పూర్తిగా తెలుగమ్మాయిగా మారిపోయారు.ఇక ప్రస్తుతం రాశి కన్నా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారో అలాగే మొదటిసారిగా హిందీలో రుద్ర అనే వెబ్ సిరీస్ ద్వారా నెగటివ్ పాత్రలో నటించారు.

ఈ విధంగా సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమాల గురించి అలాగే తెలుగు వంటల గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.మొదట్లో నార్త్ నుంచి సౌత్ వచ్చిన తర్వాత ఇక్కడి వంటలు తినాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది అయితే ఆ కారం మసాలా వాసన చూడగానే నోరూరిపోతుందని మెల్లిగా తాను కూడా తెలుగు వంటలకు అలవాటు పడ్డానని ఈమె తెలిపారు.

ముఖ్యంగా తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని, ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా బిర్యాని తిన్న ఈ టెస్ట్ మాత్రం రాదంటూ ఈమె తనకి ఇష్టమైన హైదరాబాద్ బిర్యాని గురించి మాట్లాడారు. ఇకపోతే ఇక్కడ వంటలకు బాగా అలవాటు పడిన తాను ఇంట్లో కూడా ఇలాగే కారం తినడం చూసి తన కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోయారని త్వరలోనే వారికి కూడా తెలుగు రుచులు పరిచయం చేస్తానంటూ ఈ సందర్భంగా తెలుగింటి వంటల పై రాశిఖన్నా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే తాజాగా ఈమె పక్కా కమర్షియల్ థాంక్యూ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ రెండు చిత్రాలు కాస్త నిరాశపరిచాయని చెప్పాలి.