సైలెంట్ గా ఓ యింటివాడేన నటుడు శ్రీ సింహ.. అబ్బాయి పెళ్లిలో బాబాయి హడావిడి సూపర్!

ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కొడుకు, సినీ హీరో అయిన శ్రీ సింహ వివాహ బంధంలో అడుగుపెట్టారు. ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ మనమరాలు రాగ మాగంటితో శ్రీ సింహ వివాహం యూఏఈ లో అత్యంత వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, పలువురు సినీ ప్రముఖుల మధ్య జరిగింది.

ఈ పెళ్లిలో కీరవాణి కుటుంబ సభ్యులతో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా సందడి చేశారు. అలాగే హైదరాబాదులో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో మాత్రం అనేకమంది సినీ ప్రముఖులు హాజరై కొత్తజంటకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక కొడుకు పెళ్లి లో బాబాయ్ తన భార్యతో కలిసి చేసిన డాన్స్ పెళ్లి మొత్తానికి హైలెట్ అని చెప్పాలి.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్ కి వస్తావా మంచి కొస్తావా పాటకి రాజమౌళి దంపతులు చేసిన డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పెద్ద పెద్ద హీరోల చేత డాన్సులు చేయించిన రాజమౌళిలో ఇంత మంచి టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక రాగా, శ్రీ సింహ దంపతుల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాహంతో మురళీమోహన్ కుటుంబానికి కీరవాణి కుటుంబానికి మరింత మైత్రి ఏర్పడింది.

ఇక శ్రీ సింహా విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఇతను తరువాత మత్తు వదలరా అనే సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. తర్వాత ఉస్తాద్, తెల్లవారితే గురువారం, భాగ్ సాలే వంటి సినిమాలు తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని మత్తు వదలరా 2 సినిమాతో మరింత పెద్ద హిట్ అందుకున్నాడు. ఇక రాగా మాగంటి విషయానికి వస్తే ఆమె ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మాస్టర్స్ చదివి ప్రస్తుతం తాతయ్య మురళీమోహన్ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యంలో కొన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.