విశాల్ సినిమా.! ఓ యాక్సిడెంట్ సెంటిమెంటు.!

సెంటిమెంటా.? ఫ్లాపులకి ఆయింటుమెంటా.? అయినా, ప్రతిసారీ విశాల్ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదాలు ఎందుకు జరుగుతుంటాయి.? ఎన్నెన్నో డౌటానుమానాలు వస్తున్నాయి చాలామందికి.! తమిళ హీరో విశాల్ మన తెలుగోడే. బై లింగ్వల్ ఫిలిం.. అంటాడుగానీ, తమిళ సినిమాల్ని తెలుగులోకి డబ్బింగ్‌గా విడుదల చేస్తుంటాడంతే. ఏ సినిమా చేసినాగానీ, ఇటీవల ‘ప్రమాదం’ లేకుండా పూర్తి చేయడం లేదు విశాల్.

సాధారణంగా విశాల్ సినిమాలకి అతనే నిర్మాత కూడా. దర్శకత్వం, యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ.. ఇలా కీలక అంశాల్లో విశాల్ తనదైన పాత్ర వుండేలా చూసుకుంటుంటాడు. పబ్లిసిటీ సంగతి సరే సరి.

అన్నట్టు, పబ్లిసిటీ అంటేనే విశాల్.. విశాల్ అంటేనే పబ్లిసిటీ.! ఈ యాక్సిడెంట్లు కూడా అలాంటి పబ్లిసిటీ స్టంట్లేనా.? అన్న డౌట్స్ వస్తున్నాయంటే, ఆ స్థాయిలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయ్.. వాటి చుట్టూ సినిమా మీద సింపతీ వచ్చేలా విశాల్ చేసుకుంటున్నాడు మరి.

అయితే, ప్రతిసారిలా ఈసారి సింపతీ రాలేదు. నిజానికి, తృటిలో పెను ప్రమాదం తప్పిందట. నిజంగానే సుమీ.!