Samantha: అందుకే.. అలాంటి సినిమాలకు దూరంగా ఉంటా : సమంత

Samantha: టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత తాజాగా హిందీ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ ఈ నెల 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతం సామ్‌.. ఈ సిరీస్‌ ప్రొమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత.. సినిమాల్లో మహిళల పాత్ర గురించి మాట్లాడారు.

మహిళా పాత్రలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, మహిళలకు గుర్తింపు వచ్చేలా చేయడం నటిగా తన బాధ్యత అని అన్నారు. ఆడియన్స్‌ను తక్కువ అంచనా వేయకూడదని.. వారు అన్ని విషయాలను గమనిస్తుంటారని సమంత అన్నారు. అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాల్సి ఉంటుందన్నారు.

Samantha: ఆ కామెంట్‌కు నొచ్చుకున్న సమంత!?

తాను ఓ విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు.. దానికి సంబంధించి పూర్తి బాధ్యత తనపై ఉంటుందన్నారు. అందుకే సినిమాల్లో పాత్రను ఎంచుకునే సమయంలో ఆచితూచి అడుగు వేస్తానని తెలిపారు. ఎన్నో విషయాలు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే సినిమాల్లో రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు తాను దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. యాడ్స్‌ విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సామ్‌ చెప్పుకొచ్చారు.

ఇక ఇదే కార్యక్రమంలో ‘సిటాడెల్‌: హనీ బన్నీ’లో తన పాత్ర గురించి కూడా సామ్‌ మాట్లాడారు. ఈ సిరీస్‌లో నటించడం తనకు సవాల్‌గా అనిపించిందన్నారు. ఇందులో తన పాత్ర హీరోకు సమానమైనదని.. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ హీరోతో సమానంగా చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయన్నారు. అందుకోసం నటీనటులు చాలా మంది ఎదురుచూస్తుంటారని చెప్పారు. కానీ తనకు ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినప్పటికీ అందులో సెలక్టివ్‌గానే వెళ్తున్నట్లు సామ్‌ తెలిపారు.

Samantha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోమారు స్పందించిన సమంత

సమంత ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్‌ సిరీస్‌ ‘ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’. ఇందులో వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా నటించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్‌ అండ్‌ డీకే ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’కు రీమేక్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో కే కే మీనన్‌, సిమ్రాన్‌, సాకిబ్‌ సలీమ్‌, సికందర్‌ ఖేర్‌, సోహమ్‌ మజుందార్‌, శివన్‌కిత్‌ పరిహార్‌ మరియు కష్వీ మజ్ముందర్‌ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

జన్మలో అతని సినిమాలు చూడను || Director Geetha Krishna Shocking Comments On Kiran Abbavaram || TR