అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ చాలా ఫాస్ట్ గా, చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ముందు పాట్నా, తరువాత చెన్నై తర్వాత కొచ్చి తర్వాత ముంబై ఇలా ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు మూవీ టీం.
అయితే అనుకోని అవాంతరంలా ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఒక పోలీస్ కేసు నమోదు అయింది. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని ఎప్పుడూ ఆర్మీ అని పిలుస్తారు. ఈ విషయంపై చాలాసార్లు చాలామంది అభ్యంతరం తెలియజేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన అల్లు అర్జున్ మొన్న ముంబైలో జరిగిన ఈవెంట్లో తన ఫ్యాన్స్ తన కోసం పోరాడుతారని అందుకే వారిని ఆర్మీ అంటానని వివరణ ఇచ్చారు.
అయితే ఆర్మీ అనే పదం వాడుతున్నందుకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సికింద్రాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని, జాతీయ సమగ్రత దేశ భద్రతకు సంబంధించిన అంశం ఆర్మీ అని చెప్పారు. తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి సరిహద్దుల్లో కాపలాకాస్తున్న జవానులను అవమానిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కావాలంటే ఆయన తన అభిమానులను వీరాభిమానులు, డై హార్ట్ ఫ్యాన్స్, వెర్రి అభిమానులు ఇలా ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు. అంతేకానీ దేశ సైనికులను అవమానపరిచేలా ఆర్మీ అనే పదం ఉపయోగించడం కరెక్ట్ కాదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు శ్రీనివాస గౌడ్. మరి ఈ కేసుని పోలీసులు స్వీకరిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది, అలాగే ఈ కేసు విషయంలో పై అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తాడు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.