Ram Charan: ఆ సినిమా విషయంలో అనుకోకుండా రామ్ చరణ్ కి కలిసొచ్చిన అదృష్టం…?

Ram Charan: మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ఈయన నటించిన ఆచార్య, RRR సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇక ఈ సినిమాల తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు చిత్రబృందం వెల్లడించారు. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంది.ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి హాలిడే వెకేషన్ లో ఉన్న రామ్ చరణ్ ఈ హాలిడే ట్రిప్ పూర్తికాగానే సరాసరి RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లు దారుణంగా తగ్గించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా సినిమా టికెట్లు పెంచుతూ మరొక కొత్త జీవో విడుదల చేశారు.ఈ జీవో ప్రకారం ఏ సినిమా అయితే ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో 20 శాతం షూటింగ్ జరుపుకుం టుందో ఈ సినిమాకు మాత్రమే పెంచిన టికెట్ల ధరలు వర్తిస్తాయని లేకపోతే యధావిధిగా పాత ధరలే ఉంటాయని సూచించారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన 15 వచిత్రాన్ని అనుకోకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. అయితే కొత్త జీవో ప్రకారం రామ్ చరణ్ సినిమాకు పెంచిన టికెట్ల ధరలు కలిసొస్తుందని చెప్పవచ్చు. అనుకోకుండా ఈ సినిమాని రాజమండ్రిలో చిత్రీకరణ చేయడం ఈ సినిమాకు భలే కలిసి వచ్చిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.