నాగార్జున కోసం వస్తున్న ఆ ముద్దుగుమ్మ.!

బిగ్‌బాస్ షోకి నాగార్జున కొత్త గ్లామర్ అద్దబోతున్నారట. అదేంటంటే, ఓ హీరోయిన్‌ని హౌస్‌లోకి పంపించబోతున్నారట. ఆల్రెడీ ఆ ముద్దుగుమ్మతో సంప్రదింపులు మొదలు పెట్టేశారట హోస్ట్ నాగార్జున.

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మమతా మోహన్ దాస్. ఈ ముద్దుగుమ్మ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌కి కావల్సింది అచ్చంగా ఇలాంటి ఓ కంటెస్టెంటే. అయితే, మమతా మోహన్ దాస్‌ని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌లోనే పంపిస్తున్నారట.

కేవలం కొన్ని రోజులు మాత్రమే.. అదీ రెండు కానీ, మూడు రోజులు కానీ అని ప్రచారం జరుగుతోంది. గతంలో నాగార్జునతో ‘కింగ్’, ‘కేడీ’ సినిమాల్లో మమతా మోహన్ దాస్ నటించింది.

ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలో నాగార్జున ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆ అభిమానంతోనే నాగార్జున అడిగారని మమతా మోహన్ దాస్ బిగ్‌బాస్ షోలో సందడి చేసేందుకు అంగీకరించిందనీ సమాచారం.

ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ఒకవేళ మమతా మోహన్ దాస్ రావడం నిజమే అయితే, షోకి మరికాస్త హైప్ రావడం.. గ్లామర్ యాడ్ అవ్వడంతో పాటూ, వీక్షకుల్లోనూ ఒకింత స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందనడం అతిశయోక్తి కాదేమో.

తనదైన సింగింగ్ టాలెంట్, డాన్సింగ్ టాలెంట్‌తో పాటూ గ్లామర్‌తోనూ మమతా మోహన్ దాస్ షోకి ఊపు తెస్తుంది. అన్నట్లు బిగ్‌బాస్ షోకి రావడానికి మమతా మోహన్ దాస్‌కి షాకింగ్ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని తెలుస్తోంది.

చూడాలి మరి, ఈ గెస్ట్ హౌస్ మేట్‌తో బిగ్‌బాస్‌కి నిజంగానే ఊపు తెచ్చే ప్రయత్నం హోస్ట్ నాగార్జున చేస్తున్నారా.! లేదంటే ఇదంతా ఉత్త గాసిప్పేనా.! అని.!