పుష్ప సినిమా లో ఆ స్ట్రాంగ్ టాప్ హీరో స్పెషల్ గెస్ట్ ?

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్నసినిమా పుష్ప. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ రసాద్ సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమాలలో పుష్ప కూడా ఒకటి. ఎక్కువ భాగం ఫారెస్ట్ లొకేషన్ లోనే షూటింగ్ జరపాల్సి రావడం తో లాంగ్ షెడ్యూల్ ని తూర్పు గోదావరి జిల్లా రంప చోడవరం మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరుగుతోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నా సుకుమార్. లారీ డ్రైవర్ గా ఊర మాస్ గెటప్ లో అల్లు అర్జున్ ని చూపిస్తున్నాడు. అయిదు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో కాస్టింగ్ సంబంధించి ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా పుష్ప సినిమాలో విజయ్ సేతుపతి పోలీస్ అధికారి పాత్రలో కనిపించాల్సి ఉంది. కరోనా మహమ్మారీ వల్ల విజయ్ సేతుపతి కాల్షీట్లు వృధా అయిపోయాయి. దాంతో సేతుపతి పుష్ప నుంచి తప్పుకున్నారు. దాంతో ఆ క్యారెక్టర్ కి మళ్ళీ సుకుమార్ కి కావాల్సిన నటుడు దొరకలేదు. అయితే తాజాగా ఈ క్యారెక్టర్ కి మంచు మనోజ్ పేరును పరిశీలిస్తున్నారని టాక్ మొదలైంది.

ప్రస్తుతం మనోజ్ సొంత బ్యానర్ లో అహం బ్రహ్మాస్మీ అన్న సినిమా చేస్తున్నాడు. గత కొంతకాలంగా మనోజ్ కి సక్సస్ లు లేని సంగతి తెలిసిందే. దాంతో కొంత కొంత గ్యాప్ తీసుకొని పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు. మరి ఇలాంటి సమయంలో పుష్పలో నటించేందుకు ఓకే చెప్పాడా .. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా మనోజ్ ఒప్పుకుంటాడని అంటున్నారు. గతంలో ఇద్దరు కలిసి వేదం అన్న సినిమాలో నటించారు. చూడాలి మరి మనోజ్ నిజంగా పుష్ప సినిమాలో చేస్తాడా లేదా.