ఆ ఒక్క ఫోటో నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది.. అనుపమ కామెంట్స్ వైరల్!

అనుపమ పరమేశ్వరన్ దక్షిణాది సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈమె త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ”అఆ” తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించిన అనుపమ పరమేశ్వరన్ అనంతరం శతమానం భవతి సినిమాలో అవకాశం అందుకున్నారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో కూడా ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇలా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపిన అనుపమ పరమేశ్వరన్ కెరియర్ లో ఒకానొక సమయంలో కాస్త బ్రేక్ పడిందని చెప్పాలి.అయితే ప్రస్తుతం తిరిగి ఈమె వరస అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమా మంచి హిట్ కావడంతో అనుపమ ఎంతో సంతోషంలో ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ నేను నేడు ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు గల కారణం ఒకే ఒక్క ఫోటో అంటూ తనకు సినిమా అవకాశం వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.ప్రేమమ్ సినిమా కోసం సరదాగా తన స్నేహితులు ఈమె ఫోటోని ఆడిషన్స్ కోసం పంపించారట.ఇక ఆడిషన్స్ లో ఆ ఫోటో చూసిన డైరెక్టర్ ఆ సినిమాలో హీరోయిన్గా నన్ను ఎంపిక చేశారని అలా తాను ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ తన సినీ ఎంట్రీ వెనుక దాగి ఉన్న ఆ ఫోటో గురించి తెలియజేశారు. ఇక ప్రస్తుతం నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 హిట్ అయింది ఇకపోతే నిఖిల్ తో ఈమె 18 పేజెస్ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.