అసలు నేను లిప్ టు లిప్ కిస్సే ఇవ్వలేదు.. అది రియల్ కిస్ కాదు: కాజల్ అగర్వాల్

That is graphics liplock not real says kajal agarwal

మూడు పదుల వయసు దాటినా కూడా ఇంకా తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తోంది కాజల్ అగర్వాల్. ఇప్పటికీ తన చేతినిండా సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది కాజల్.

That is graphics liplock not real says kajal agarwal
That is graphics liplock not real says kajal agarwal

కాజల్ రొమాంటిక్ సీన్లను కూడా బాగా పండించగలదు. ముఖ్యంగా మహేశ్ బాబుతో చేసిన బిజినెస్ మెన్ చిత్రంలోనూ కాజల్ అందానికి ప్రతిరూపంలా నిలిచింది. ఆ సినిమాలో మహేశ్ తో లిప్ లాక్ కూడా చేసింది.

చాలా సినిమాల్లో తన హీరోలకు లిప్ లాక్ చేసినా.. బ్రదర్స్ సినిమాలో హీరో సూర్యతో తను చేసిన లిప్ లాక్ నిజం కాదట. అది ఫేక్ అట. ఉత్తుత్తే నట. నిజానికి బ్రదర్స్ సినిమాలో ఆ లిప్ లాక్ సీన్ చాలా ముఖ్యమైనది.

తాజాగా ఆ లిప్ లాక్ సీన్ గురించి తన మనసులో మాటను బయటపెట్టింది ఈ సుందరి. సూర్య తనను నిజంగా ముద్దు పెట్టుకోలేదని.. అది గ్రాఫిక్స్ లో చేసిందని చెప్పుకొచ్చింది.

That is graphics liplock not real says kajal agarwal
That is graphics liplock not real says kajal agarwal

నిజానికి ఆ సీన్ చేసే సమయంలో కిస్ సీన్ చేయడం నాకు ఇష్టం లేదు. సూర్య కూడా కిస్ సీన్ వద్దన్నారు. మా ఇద్దరికీ కిస్ సీన్ చేయడం ఇష్టం లేదు కాబట్టి.. ఆ సీన్ ఎలా తీయాలో అని మూవీ యూనిట్ ఆలోచించింది. ఎందుకంటే ఆ సీన్ ఆ సినిమాకు చాలా అవసరం. సూర్య కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుండటంతో డైరెక్టర్ ఆనంద్ గారే ఆ సీన్ ను మరింత విచిత్రంగా తెరకెక్కించారు.

అసలు ఇద్దరం కలిసి ముద్దు పెట్టుకోకున్నా… నిజమైన ముద్దులాగానే డైరెక్టర్ చిత్రీకరించారు. బ్యూ మ్యాట్ ముందు సూర్యను కుర్చీలో కూర్చోబెట్టి.. ఓ గ్లాస్ పై ముద్దు పెట్టించారు. అలాగే నేను కూడా ఓ బొమ్మను ముద్దు పెట్టారు. ఇద్దరిది కలిపి నిజమైన ముద్దులా గ్రాఫిక్స్ లో చిత్రీకరించారు.. అంటూ ఆ ముద్దు రహస్యాలను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

కానీ.. ఆ సినిమా చూసిన వాళ్లంతా నిజంగా అది ముద్దుసీనే అని అనుకుంటారు. అంత నాచురల్ గా తెరకెక్కించారు.

ఇక.. ఈ సీన్ మేకింగ్ సీన్ ను కూడా మూవీ యూనిట్ అప్పట్లోనే యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. మీరు కూడా చూడండి ఓసారి.