ఆరోజు రోడ్డుపై పరిగెత్తిచ్చి నాన్న చితకబాదారు.. ఫస్ట్ డే ఫస్ట్ షో సీక్రెట్ బయటపెట్టిన చిరు!

టాలివుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వందకు పైగా సూపర్ హిట్ సినిమాలలో నటించిన చిరు మెగాస్టార్ గా గుర్తింపు పొందాడు. మధ్యలో కొంతకాలం సినిమాలకు దూరమైన చిరంజీవి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. వయసు పెరిగినా కూడా గ్లామర్ విషయంలో కూడా కుర్ర హీరోలతో సమానంగా గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఎవర్ గ్రీన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన “ఫస్ట్ డే ఫస్ట్ షో” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యాడు.

పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాణంలో జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే అందించిన తాజా చిత్రం ” ఫస్ట్ డే ఫస్ట్ షో “.ఈ సినిమాకు లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి,
వంశీధర్ గౌడ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ..సినిమా మంచి హిట్ అవ్వాలని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా తన చిన్ననాటి విషయాలనూ కూడా పంచుకున్నారు.

ఈ ఈవెంట్ లో చిరు ఒక సీక్రెట్ బయటపెట్టాడు. తన ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో అనుభవమెలా చెబుతూ.. చిన్నప్పుడు తన తండ్రీ కొట్టిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు చిరంజీవి మాట్లాడుతూ పరువు పోతుందేమో అని ఇప్పటివరకు ఈ విషయం ఎక్కడ చెప్పలేదు. నాకు కూడా ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో అనుభవం ఉంది. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఈ విషయం జరిగింది . మా చుట్టాలు అబ్బాయి ఒకరికి నందమూరి తారకరామారావు అంటే ఎంతో ఇష్టం. వాడితో కలసి ఎన్టీఆర్ నటించిన ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లాం.నాతో పాటు నాగబాబు కూడా వచ్చాడు . ఆ రోజు విపరతీమైన రద్దీ ఉండటం వల్ల టికెట్లు తీసుకొనే సమయంలో నాగబాబు బాగా నలిగిపోయాడు. ఎక్కువ రద్దీ ఉండటంవల్ల నాగబాబు ఊపిరాడక బిక్క మొఖం పెట్టేసాడు. కరెక్ట్ గా ఆ సమయంలో మా నాన్న అమ్మ అంతకుముందు షో చూసి వస్తున్నారు. నాగబాబు పరిస్థితి ఎలా ఉండేసరికి నాన్నకి కోపం వచ్చి థియేటర్ దగ్గర మొదలుపెట్టి ఇంటికి వచ్చేవరకు కొడుతూనే ఉన్నాడు అంటూ చిరు చెప్పుకొచ్చాడు.