చై “థ్యాంక్ యూ” ట్రైలర్ లో సమంతకి స్ట్రాంగ్ పంచ్.. ఇదే ట్రెండింగ్.!

Naga Chaitanya Thank You Movie

టాలీవుడ్ లో మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లో ఒకప్పటి స్టార్ జంట అక్కినేని నాగ చైతన్య మరియు సమంత ల జంట కూడా ఒకటి. అయితే ఈ జంట అనుకోని రీతిలో గత ఏడాది విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో అక్కడ నుంచి సమంతపై ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే.

కారణం ఏదైనప్పటికీ కూడా చైతు కంటే సమంతకే ఎక్కువ దెబ్బలు ఎదురయ్యాయి. అయినా కూడా ఆమె భారీ ఆఫర్స్ తో బిజీగా మారిపోయింది. అలానే ఇంకోపక్క నాగ చైతన్య కూడా మంచి సినిమాలు చేస్తూ హిట్స్ కూడా అందుకున్నాడు. మరి ఇప్పుడు మరో సినిమా “థ్యాంక్ యూ” తో రిలీజ్ కి రెడీగా ఉండగా..

మేకర్స్ నిన్ననే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ ట్రైలర్ కి రెస్పాన్స్ బాగానే వస్తుంది కానీ ఓ డైలాగ్ మాత్రం కావాలనే సమంత – చైతు లకోసం పెట్టినట్టు ఉందని ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది.

ప్రేమిస్తున్నా అని చెప్పి అలా ఓ మనిషిని పట్టుకొని వేలాడడం కన్నా వారిని స్వేచ్ఛగా వదిలేయడం కూడా ప్రేమే అని ఓ డైలాగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇది సామ్ కి పంచ్ లాగే ఉందని అంతా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ట్రైలర్ లో ఈ డైలాగ్ మంచి రచ్చ లేపుతుంది.