తంగలాన్‌పై అంచనాలు పెంచిన గ్లింప్స్‌!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ నుంచి రాబోతున్న మోస్ట్‌ ఎక్జయిటింగ్‌ ప్రాజెక్టుల్లో ఒకటి తంగలాన్‌ పా రంజిత్‌ దర్శకత్వంలో అడ్వెంచరస్‌ హిస్టారికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన తంగలాన్‌ గ్లింప్స్‌ వీడియోతోపాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి.

ముందుగా ఈ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే కానుకగా విడుదల చేయాలని నిర్ణయించగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డది. 2024 వేసవిలో తంగలాన్‌ థియేటర్లలో సందడి చేయబోతుందని ఇటీవలే వార్తలు రాగా.. దీనిపై అధికారిక అప్‌డేట్‌ అందించారు మేకర్స్‌.

ఏప్రిల్‌లో తంగలాన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్‌.. తేదీపై మాత్రం సస్పెన్స్‌ పెట్టారు. ఇటీవలే బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అంటూవిక్రమ్‌ తన సైన్యంతో సమరాన్ని వెళ్తున్న నయా లుక్‌ గూస్‌బంప్స్‌ తెప్సిస్తోంది. ఈ చిత్రంలో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తుండగా.. పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ కీ రోల్స్‌ పోషిస్తున్నారు.

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌, నీలమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్‌ నుంచి విడుదల చేసిన మాళవికా మోహనన్‌ లుక్‌.. డీగ్లామరైజ్‌డ్‌గా కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.

ఇప్పటిదాకా గ్లామరస్‌ పాత్రలకే పరిమితమైన ఈ భామ తంగలాన్‌లో నయా అవతార్‌ను చూపించబోతున్నట్టు స్టన్నింగ్‌ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌ పా రంజిత్‌.