తమన్‌కు కొన్నేళ్లుగా కాపీ క్యాట్ అనే బిరుదున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో అవి తారాస్థాయికి చేరుకోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వాటిపై తమన్ స్పందించాడు. బాగానే హర్ట్ అయ్యాడు కూడా. ఆ తరువాత చాలా రోజులు గ్యాప్ ఇచ్చి అల వైకుంఠపురములో అనే అద్భుతమైన ఆల్బమ్‌ను ఇచ్చాడు. ఆ తరువాత వరుసగా హిట్స్ మీద హిట్స్ కొడుతూనే దేవీ శ్రీ ప్రసాద్‌ను కూడా వెనక్కి తోసేశాడు. ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ నిన్ని విడుదలైన V చిత్రానికి తమన్ అందించిన నేపథ్య సంగీతంతో మళ్లీ పరుపు పోగోట్టుకున్నట్టైంది.
V సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాను.. అదిరిపోయింది.. మీకు నచ్చుతుందని రిలీజ్‌కు ముందు రోజు ప్రగల్భాలు పలికాడు తమన్. కానీ తీరా సినిమా చూస్తే తెలిసింది.. అవన్నీ ఎత్తుకొచ్చిన సౌండ్స్ అని. నాని ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే సౌండ్.. ‘రాక్షసుడు’ సినిమాలోని థీమ్ మ్యూజిక్‌ను ఉన్నదున్నట్టుగా వాడేసాడని తమన్‌ను ఏకి పారేస్తున్నారు. అసలే ఆ సినిమా తమిళ, తెలుగు భాషల్లొ సూపర్ హిట్ అయ్యాక ఆ సౌండ్‌ను జనాలు గుర్తుంచుకోరా.. ఇట్టి పసిగట్టరా? తమన్ ఆ మాత్రం జాగ్రత పడలేదా అని అంటున్నారు.
ఇక నాని క్యారెక్టర్ వచ్చిన ప్రతీసారి ‘గాట్ సీజన్ 6’ లోని ‘వైల్డ్ ఫైర్’ నేపథ్య సంగీతాన్ని వాడేశాడట. 2 గంటల 8 నిమిషాల 50 సెకండ్ల వద్ద ‘అసురన్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను వాడేశాడట. ఇలా టైంతో సహా, సీన్లతో సహా నెటిజన్ల దొరకబట్టేసరికి తమన్ గాలిపోయింది. అసలే ఇది సోషల్ మీడియా యుగం. పాతాళంలో దాగి ఉన్న దొరకపట్టే రోజులు. ఇలా కాపీ కొడితే క్షణాల్లో ఒరిజినల్‌ను మన ముందు ఉంచుతారు. ఏది ఏమైనా V చిత్రంతో తమన్ పరువుపోయింది.