సత్యం రాజేశ్‌.. టెనెంట్‌ ఫ్యామిలీ!

‘సత్యం’ సినిమాతో అద్భుతమైన కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ నటుడు ‘సత్యం’ రాజేశ్‌ ఆ తర్వాత కమెడియన్‌గా తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక ఈ కమెడియన్‌ హీరోగా మారిన విషయం తెలిసిందే. గతేడాది ‘మా ఊరి పొలిమేర 2’ అంటూ వచ్చి సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా అనంతరం సత్యం రాజేష్‌ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.

తాజాగా రాజేష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘టెనంట్‌’. ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రానికి వై.యుగంధర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మేకర్స్‌ట్రైలర్‌ విడుదల చేశారు.

ప్రస్తుత సమాజంలో మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసేలా ఈ ట్రైలర్‌ సాగింది. ఇక ఈ సినిమాను శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్‌ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మోగుళ్ళ చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్‌ రెడ్డి .ఎన్‌ సహా నిర్మాత. మేఘా చౌదరి, చందన పయావుల, భరత్‌ కాంత్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.