టీజర్ టాక్ : కిరణ్ అబ్బవరం నుంచి పక్కా మాస్ “మీటర్”

టాలీవుడ్ లో టాలెంట్ అలాగే అదృష్టం ఉంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా మంచి సినిమాలు అందించడం జరుగుతుంది అని లేటెస్ట్ గా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ప్రూవ్ చేసాడు. తన మొదటి రెండు సినిమాలతో మంచి మార్కెట్ నే సెట్ చేసుకున్న ఈ యంగ్ హీరో లేటెస్ట్ గా వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేసి మరో హిట్ ని కొట్టాడు.

అయితే ఈ సినిమా వచ్చిన మరో నెల లోనే ఇంకో సినిమా రిలీజ్ తో తాను సిద్ధంగా ఉన్నాడు. కాగా ఈ సినిమా అయితే “మీటర్” కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు కాడూరి రమేష్ తెరకెక్కించాడు. మరి ఈ సినిమా నుంచి అయితే ఈరోజు మేకర్స్ టీజర్ ని విడుదల చేశారు. ఇక ఈ టీజర్ ఎలా ఉందో చెప్పాలంటే..

కిరణ్ అబ్బవరం పోలీస్ గెటప్ లో కనిపిస్తుండగా టెంపర్, పటాస్ చిత్రాల్లో హీరోలని చూసినట్టుగానే ఓ రెగ్యులర్ పోలీస్ గా కనిపిస్తున్నాడు. అలాగే అలాంటి వాడికి ఓ సరైన పొలిటీషియన్ లేదా పవర్ లో ఉన్న వ్యక్తికి యుద్ధం మొదలైతే ఎలా ఉంటుంది అనేది మెయిన్ పాయింట్ లా కనిపిస్తుంది.

ఇక ఈ గ్యాప్ లో వచ్చే ఫన్ ఇతర అంశాలు టీజర్ లో బాగున్నాయి. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ అయితే మాస్ స్టఫ్ కోరుకునే ఆడియెన్స్ కి నచ్చే లానే ఉన్నాయి. అంతే కాకుండా కిరణ్ అబ్బవరం నుంచి అయితే ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ కోరుకునే వారికి తన గత సినిమాలతో పోలిస్తే బెటర్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ఇచ్చేలా ఉంది. కాగా ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో రిలీజ్ విశేషం. ఈ ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 
Meter Teaser | Kiran Abbavaram | Ramesh Kaduri | Athulyaa Ravi | Sai Kartheek | Mythri Movie Makers