‘హరోం హర’ నన్ను మలుపు తిప్పింది !

‘మామామశ్చీంద్ర’ తర్వాత సుధీర్‌ బాబు నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలవగా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. 7 రోజుల్లోనే 10 మిలియన్‌ వ్యూస్‌ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో నిలిచి..సుధీర్‌బాబు ఈసారి తప్పనిసరిగా భారీ హిట్‌ కొడుతాడనే నమ్మకాన్ని ఇచ్చింది.

ఈక్రమంలో టీజర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై సుమంత్‌ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాకు గతంలో ‘సెహరి’ అనే చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన జ్ఞానసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

‘రెడ్‌, నేల టికెట్టు’ సినిమాల్లో కథానాయికగా చేసిన మాళవిక శర్మ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘బడ్జెట్‌ విషయంలో ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, డైరెక్టర్‌ నన్ను సరికొత్తగా ప్రజెంట్‌ చేశాడని, ఈ సినిమాలో నా నట విశ్వరూపం చూస్తారని అన్నారు.