చైల్డ్ ఆర్టిస్ట్, హీరో, బిగ్ బాస్ కంటెస్టెంట్ తనీష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సినిమాల్లో హీరోగా ఎంత ఫేమస్ అయినా కూడా బిగ్ బాస్ ద్వారా జనాల్లోకి ఎక్కువగా చేరాడు. బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో ఫైనలిస్ట్ వరకు వెళ్లిన తనీష్ తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పర్చుకున్నాడు. సెకండ్ సీజన్‌లో సామ్రాట్, తనీష్, తేజస్వీ, దీప్తి సునయల గ్యాంగ్ బాగానే క్లిక్ అయింది. కౌశల్‌తో గొడవలు, దీప్తి సునయనతో రిలేషన్ తనీష్‌ను బాగా ఫేమస్ చేశాయి.
బయటకు వచ్చాక కూడా తనీష్ తన స్నేహితులతోనే క్లోజ్‌గా ఉంటూ వస్తున్నాడు. తేజస్వీ, దీప్తి సునయన, సామ్రాట్‌లతోనే ఎక్కువగా పార్టీలు చేసుకుంటాడు. ఆ మధ్య సామ్రాట్ పెళ్లిలో తనీష్, దీప్తిలు రచ్చ రచ్చ చేశారు. అయితే తాజాగా తనీష్ తన పెళ్లి గురించి కామెంట్ చేశాడు. తనీష్ స్నేహితుడిని ఓ నెటిజన్ వింత ప్రశ్న అడిగాడు. దానికి తనీష్ స్నేహితుడు కూడా వింతగానే స్పందించాడు.
మీ గ్యాంగ్‌లో అందరికీ అందరూ ఉన్నారు.. తనీష్ మాత్రమే సింగిల్‌గా ఉన్నాడు.. అతనికి కూడా ఎవరినైనా చూడండి అని ఓ నెటిజన్ కోరాడు. దానికి తనీష్ ఫ్రెండ్ వెరైటీగా స్పందించాడు. అవునుఅదే పనిలో ఉన్నాం.. 2021లో కచ్చితంగా సెట్ చేస్తామని అన్నాడు. దీనికి తనీష్ బ్రహ్మానందం స్టైల్లో రిప్లై ఇచ్చాడు. అలా చేస్తే పిసికేస్తా అంటూ బ్రహ్మీ జిఫ్ ఫైల్‌ను షేర్ చేస్తూ హెచ్చరించాడు. అంటే తనీష్‌కు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేనట్టుంది.