Kasthuri: తెలుగు జాతిని అవమానించిన తమిళ నటి!?

Kasthuri: తమిళనాడు రాజకీయాల్లో ద్రావిడ సిద్ధాంతాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిద్ధాంతం ప్రకారం బ్రాహ్మణులూ.. తమిళులు కాదని వాదన. అయితే ఈ వాదనలను విమర్శిస్తూ నటి కస్తూరి.. ‘‘రాజుల కాలంలో అంతపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తెలుగు జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ’’ మాట్లాడారు.

దీంతో ఈ వ్యాఖ్యలు చిచ్చురేపుతున్నాయి. అలాగే ‘‘ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని’’ కస్తూరి ఆరోపించారు. ఇక లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తల్లిదండ్రులైన అయినప్పుడు. ఈ దంపతులు సరోగసి పద్థతిలో తల్లిదండ్రులైనట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ తరుణంలో నటి కస్తూరి చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది.

‘‘భారతదేశంలో సరోగసి బ్యాన్‌ అయింది. జనవరి 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మెడికల్‌ రీజన్స్‌, క్లిష్ట పరిస్థితుల్లో తప్ప దీనిని ఎంకరేజ్‌ చేయకూడదు. భవిష్యత్తులో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం’’ అంటూ ఆమె ఓ ట్వీట్‌ చేసింది. దీనిని చూసిన నయనతార అభిమానులు కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ పని మీరు చూసుకోండి’ అని నెట్టింట ఏకిపారేస్తున్నారు. దీనిపై కూడా కస్తూరి స్పందించారు. ‘‘అర్హతగల న్యాయవాదిగా ఈ చట్టంపై మాట్లాడే హక్కు నాకుంది. నేను ఎవరినీ ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి అంటే మీకు ఇష్టం లేదట కదా.

ఓ సందర్భంలో మా కుటుంబ సభ్యులు చెప్పారు. ఇష్టం లేనప్పుడు ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో ఎందుకు యాక్ట్‌ చేశారు. ఆయనంటే ఇష్టం ఉంటే ‘గాడ్‌ ఫాదర్‌’ సక్సెస్‌ మీట్‌ ఫొటోలు షేర్‌ చేయండి’ అంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు ఆమె కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మీరేం మాట్లాడుతున్నారు? ఈ పిచ్చిమాటలు ఎందుకు? చిరంజీవి అంటే ఇష్టపడని వారుండరు. అలాంటిది నా విషయంలో మీ తల్లిదండ్రులు అలా చెప్పడానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు’’ అని పేర్కొన్నారు.