బాలయ్య సినిమాపై మిల్కీ బ్యూటీ షాకింగ్ పోస్ట్.!

టాలీవుడ్ సహా తమిళ్ లో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. మరి తమన్నా ఇప్పుడు హీరోయిన్ గా అయితే మెగాస్టార్ చిరంజీవి తో “భోళా శంకర్” అలాగే మరో సూపర్ స్టార్ రజినీకాంత్ తో తమిళ్ లో “జైలర్” అనే రెండు భారీ చిత్రాలు అయితే ఆమె చేస్తుంది.

ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు నుంచి అయితే ఈమె నందమూరి బాలయ్య నటిస్తున్న 108వ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది అని సరిలేరు నీకెవ్వరు తర్వాత అనీల్ రావిపూడి మరోసారి తన చిత్రంలో అయితే తమన్నా ని తీసుకున్నాడని పలు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు దీనిపై తమన్నా షాకింగ్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. తనకి అనీల్ రావిపూడితో వర్క్ చేయడం ఇష్టమే అని అలాగే బాలయ్య అన్నా కూడా ఎంతో గౌరవం ఉందని కానీ వారి సినిమాలో నేను నటిస్తున్నాను అని కొన్ని ఆర్టికల్స్ వార్తలు నా దృష్టికి వచ్చాయి అని..

దీనిపై క్లారిటీ ఇస్తున్నాను ఇవన్నీ అవాస్తవం అని అలాగే ఇదెంతో అప్సెటింగ్ గా అనిపిస్తుంది అని ఇలాంటివి ప్రచారం చేసే ముందు కొంతైనా రీసెర్చ్ చేసి పెట్టండి అంటూ ఆ వార్తల ప్రచారకులపై కాస్త ఘాటుగానే స్పందించింది. దీనితో తమన్నా నుంచి ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా బాలయ్య సినిమాలో అయితే కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.