తమన్నా జస్ట్ ఐటెమ్ బాంబ్.!

బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిందన్న ఆనందం తమన్నాకి ఎంతో సేపు నిలవలేదు. పేరుకే స్టార్ హీరోల సినిమాలు. కానీ, ఈ రెండు సినిమాల్లోనూ తమన్నా పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించిన ‘జైలర్’ రిలీజ్ అయ్యింది.

తమన్నా కేవలం ఐటెం గాళ్ అన్నట్లుగానే మాట్లాడుకుంటున్నారు. తమన్నా నటించిన ఐటెం సాంగ్ బాగుంది అన్న రెస్పాన్సే వినిపిస్తోంది ‘జైలర్’ నుంచి తమన్నా విషయంలో.

ఇక రేపు అనగా ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ కూడా రిలీజ్ కానుంది. రేపటితో ఆ విషయమూ తేలిపోనుంది. ఇప్పటికే ఈ సినిమాలో తమన్నాకి అంత సీను లేదని తెలిసిపోయింది. కీర్తి సురేష్ పాత్రకే ఈ సినిమాలో ఎక్కువ స్కోప్ వుండబోతోంది.

సో, చూస్తుంటే, తమన్నా జస్ట్ ఐటెం బాంబ్ అన్న పేరే తెచ్చుకుంది ఈ రెండు ప్రెస్టీజియస్ మూవీస్ ద్వారా. కానీ, రెండు సినిమాల్లోనూ తమన్నా నటించిన ‘వా నువ్ కావాలయ్యా’, ‘మిల్కీ బ్యూటీ..’ సాంగ్స్ మాత్రం ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అయ్యాయనీ, అవుతాయనీ చెప్పొచ్చేమో.!