ఇప్పుడు ఇండియా సినిమా దగ్గర ఉన్న కొందరు టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో తమన్నా భాటియా కూడా ఒకరు. మరి కెరీర్ సౌత్ సినిమా నుంచి స్టార్ట్ అయ్యినా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మంచి పాపులారిటీ తమన్నా తెచ్చుకుంది. కాగా తమన్నా తో పాటుగా తన టైం లో చాలా సినిమాలు చేసిన హీరోయిన్స్ కొందరు కేవలం సౌత్ కే పరిమిత అయ్యారు.
కానీ అటు బాలీవుడ్ లో మంచి ఆదరణ అందుకున్న హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ నిలిచింది. కెరీర్ స్టార్టింగ్ కొన్నాళ్ల తర్వాత నుంచే గ్లామ్ షో స్టార్ట్ చేసిన తమన్నా నెమ్మదిగా మరింతగా డోస్ ని అయితే పెంచుతూ వచ్చింది. ఇక గత ఏడాది వచ్చిన రెండు వెబ్ సిరీస్ లలో అయితే తన హాట్ షో తో సెన్సేషన్ గా ఆమె మారింది.
తమన్నా నుంచి ఆ రేంజ్ హాట్ షో మునుపెన్నడు చూడకపోవడంతో ఆమెపై కొన్ని సీన్స్ ఫోటోలు కూడా ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇక మళ్ళీ ఇన్ని రోజులు తర్వాత సోషల్ మీడియాకి తమన్నా తన హాట్ షో తో ఫైర్ పెట్టింది. రీసెంట్ బాలీవుడ్ బ్లాస్ట్ హిట్ చిత్రం ఆనిమల్ సక్సెస్ పార్టీలో కనిపించిన తమన్నా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచింది.
తన నుంచి ఒక ఊహించని బోల్డ్ లుక్ కనిపించడంతో ఆమెపై ఇపుడు ఫోటోలు వీడియోలు మంచి వైరల్ గా మారుతున్నాయి. అలాగే ఈ దెబ్బతో ఆమె ట్విట్టర్ ట్రెండ్స్ లోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం అయితే ఆమె హీరోయిన్ గా మాత్రం కొన్ని సినిమాలే చేస్తుంది.
The gorgeous #TamannaahBhatia arrives for the success bash of #Animal. ❤️💯#tamannahbhatia #Animal #AnimalSuccessBash #trending pic.twitter.com/2ngeNb5nfV
— Filmfare (@filmfare) January 7, 2024