ఓపెన్ చేసి చూడాలని వుంది.. వామ్మో తమన్నా మామూల్ది కాదు!!

Tamannaah Excited Over Her Birthday Gifts

మిల్కీ బ్యూటీ తమన్నా బర్త్ డే నేడు (డిసెంబర్ 20). ఈ సందర్భంగా నిన్నటి నుంచి సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. నిన్ననే తమన్నా టీం గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తన వ్యానిటీ (కేరవ్యాన్)ని ఫుల్ డెకరేట్ చేశారు. దీంతో తమన్నా దెబ్బకు షాక్ అయింది. ఇంత త్వరగా ఎందుకు చేశారు.. ముందే చెబితే నేను కూడా రెడీ అయి వచ్చే దాన్ని కదా అంటూ చెప్పుకొచ్చింది. తాను ఎక్కువగా ఇందులోనే ఉంటానని, అందుకే ఇలా డెకరేట్ చేశారని తమన్నా చెప్పుకొచ్చింది.

తమన్నా ఈ మధ్య వార్తల్లో నిత్యం హల్చల్ చేస్తూనే ఉందన్న సంగతి తెలిసిందే. కరోనా సోకడం, దాన్నుంచి క్షేమంగా బయట పడటం, కాస్త లావు అవ్వడంతో నెటిజన్లు వాటి మీదే ప్రశ్నలు అడగడం ఇలా నిత్యం వార్తల్లో వైరల్ అవుతూనే వచ్చింది. ఇక ఈ మధ్యే మళ్లీ ఎఫ్ 3 సినిమా ప్రారంభోత్సవంలో కనిపించిన తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా ప్రతీ రోజు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Tamannaah Excited Over Her Birthday Gifts
Tamannaah Excited Over Her Birthday Gifts

ఇక నేడు బర్త్ డే సందర్భంగా ఉదయం నుంచి తమన్నా రచ్చ మొదలైంది. ఫ్యాన్స్, సెలెబ్రిటీలు పంపిస్తోన్న విషెస్, గిఫ్ట్‌లను చూసి గాల్లో తేలిపోయింది. ఇక స్పెషల్‌గా తన టీం మేట్స్ ఇచ్చిన గిఫ్ట్‌లపై తమన్నా కన్ను పడింది. అవి ఏంటో వెంటనే ఓపెన్ చేయాలి.. ఆగలేకపోతున్నా అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. అలా తనకు ఓ జాకెట్ వచ్చిందని.. దాన్ని వెంటనే వేసుకున్నాను అంటూ వింటర్‌లో బాగా పనికొస్తుందంటూ చిన్న పిల్లలా సంతోషాన్ని వ్యక్తం చేసింది.