తమన్నాను ఇలా బుజ్జగించేశాడు.. డైరెక్టర్ మామూలోడు కాదు!!

Tamannaah Eat Pani puri In Gurthunda Seethakalam Set

సెట్‌లో వాతావరణం ఎంత కూల్‌గా ఉంటే సీన్స్ అంతబాగా వస్తుంటాయని, అందరూ మంచి మూడ్‌లో ఉండేలా చూసుకుంటుంటాడు దర్శకుడు. అలా హీరో హీరోయిన్లు సంతోషం, మంచి మూడ్‌లో ఉండేలా వారికి ఏం కావాలో అవి సమకూర్చుతుంటారు. అలా తాజాగా తమన్నాను, ఆమె టీంను సంతృప్తి పరిచేందుకు డైరెక్టర్ ఏకంగా పానీ పూరి బండి ఓనర్‌గా మారిపోయాడు. సెట్‌లోనే పానీపూరి తయారు చేసి అందరికీ పెట్టేశాడు. అసలే అమ్మాయిలకు పానీపూరికి విడదీయలేని బంధం ఉంటుంది.

Tamannaah Eat Pani puri In Gurthunda Seethakalam Set
Tamannaah Eat Pani puri In Gurthunda Seethakalam Set

తమన్నా ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం సినిమా షూటింగ్‌లో ఉంది. ఇందులో భాగంగా సత్యదేవ్‌తో కలిసి సీన్స్‌లో నటిస్తోంది. అయితే సెట్‌లో దర్శకుడు పానీ పూరి తయారు చేసే బండిని పెట్టుకున్నాడు. అందరి కోసం పానీ పూరి తయారు చేసి పెట్టాడు. ఆ వీడియోను తమన్నా షేర్ చేసింది. ఇందులో తమ డైరెక్టర్ ఎంత మంచివాడో కదా? తన టీంకు చెబుతోంది. మన కోసం ఇలా పానీ పూరి చేసి పెడుతున్నాడని అతనిపై ప్రశంసలు కురిపించింది.

ఇక అలా పానీ పూరి తయారు చేస్తుండగానే తన టీం మెంబర్స్ నోళ్లు ఊరాయి. ఇప్పుడే ఇలా అయిపోతున్నారేంటి? అని తమన్నా వారిని అడిగింది. చాలా నెలల తరువాత పానీ పూరి తింటున్నాం కదా? అందుకే ఇలా ఉందంటూ వారు చెప్పారు. ఆ తరువాత తమన్నా తన టీంతో కలిసి పానీ పూరి తింటోన్న ఫోటోను షేర్ చేసింది. సెట్‌లో ఇలా బుజ్జగిస్తున్నారంటూ తమన్నా అసలు కథ చెప్పుకొచ్చింది. తమన్నా చేతిలో ప్రస్తుతం ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం, సీటీమార్ సినిమాలు మాత్రమే ఉన్నాయి.