సీటీమార్ సెట్‌లో సందడి.. బస్ నడిపిన తమన్నా

Tamannaah Drive Bus In Seetimaarr set

మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తమన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మామూలుగానే నెటిజన్లకు షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటుంది. ఆ మధ్య కరోనా వచ్చిందని చెప్పడం, ఓ పదిహేను రోజుల క్వారంటైన్ తరువాత నెగెటివ్ వచ్చిందని చెబుతూ సడెన్‌గా రోడ్ ట్రిప్ వేయడం ఇలా తమన్నా ప్రతీసారి నెటిజన్లను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది.

Tamannaah Drive Bus In Seetimaarr set

కరోనా రావడం, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఎక్కువగా మెడిసెన్స్ తీసుకోవడం మొహంలో మార్పులు వచ్చాయి. కాస్త లావుగా అయింది. అందరూ తన ఆరోగ్యం గురించి, కరోనా గురించి అడగకుండా లావయ్యావని అడగడంపై తమన్నా సీరియస్ అయింది. ఇప్పుడు మొత్తానికి తమన్నా మళ్లీ మునుపటి ఆకారంలోకి వచ్చింది. సీటీమార్ సెట్‌లో సందడి చేస్తోంది కూడా. అయితే తాజాగా తమన్నా మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది.

షూటింగ్ స్పాట్‌లో తమన్నా బస్ నడిపి అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే ఈ బస్‌ను సినిమా కోసం నడిపిందా? లేదా టైంపాస్ కోసం నడిపిందో తెలియడం లేదు. మొత్తానికైతే సెట్ అంతా బస్‌లో గిరగిరా తిరిగేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే సీటీమార్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసమే తమన్నా ఈ సాహసాన్ని చేసినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా తమన్నా వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది.