వామ్మో.. మహిళా అఘోరానా.! తమన్నాకి ఏమైంది.?

అంతా అనుకున్నట్టే జరిగింది. తమన్నా ఓ డిఫరెంట్ రోల్‌కి సైన్ చేసింది. అదీ ‘ఓదెల-2’ కోసం. దర్శకుడు సంపత్ నంది, చాలాకాలంగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి వున్నాడన్న సంగతి తెలిసిందే.

సంపత్ నంది తాను తెరకెక్కించిన ‘రచ్చ’ సహా పలు సినిమాల్లో తమన్నాకి ప్రత్యేకంగా అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ఇక, తమన్నా విషయానికొస్తే, కెరీర్ బిగినింగ్ నుంచీ అడపా దడపా డిఫరెంట్ రోల్స్ చేస్తూనే వుంది. ఎక్కువగా గ్లామర్‌కే పరిమితమైనా, ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి తమన్నా ఎప్పుడూ వెనుకాడలేదు.

‘ఓదెల2’ విషయానికొస్తే, ఇందులో తమన్నా భాటియా, అఘోరా పాత్రలో కనిపించబోతోందిట. మహిళా అఘోరానా.? ఇంతవరకూ ఎక్కడా వినని, చూడని వ్యవహారమే ఇది. కానీ, ఇది నిజమట.

అసలు మహిలా అఘోరాలేంటి.? అంటూ చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, అఘోరా కాదుగానీ, మహాశివుడికి భక్తురాలు.. అంటూ ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. ఏమో, సంపత్ నంది ఎలా డిజైన్ చేశాడో తమన్నా పాత్రని.!

తాజాగా, మహా శివరాత్రి సందర్భంగా తమన్నా లుక్ అయితే రివీల్ అయ్యింది ‘ఓదెల-2’ నుంచి. అఘోరా అనదగ్గ పాత్రలోనే కనిపిస్తున్నా, అఘోరా తరహాలో.. బూడిదతో అయితే మాత్రం కనిపించలేదు తమన్నా.