తమన్నాకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్‌లోని ఓ షూటింగ్‌లో పాల్గోనేందుకు వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చాక టెస్ట్ చేస్తే కరోనా అని బయట పడింది. దీంతో హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకుంది. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్తలపై తమన్నా అధికారికంగా స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేసింది. తనకు కరోనా సోకిందని, కానీ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని పేర్కొంది.
నేను, నా టీం సెట్‌లో ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా గత వారం చిన్నగా ఫీవర్ మొదలైంది.. ఆపై టెస్ట్ చేయించుకున్న తరువాత కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ వెంటనే హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాను. అయితే డాక్టర్ల సలహా మేరకు కొన్ని మెడిసిన్స్ వాడాను. ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. త్వరలోనూ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానన్న నమ్మకం ఉందని తమన్నా చెప్పుకొచ్చింది.
అయితే అక్టోబర్ 5న ఈ ప్రకటన చేసిన తమన్నా.. నేడు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇన్ని రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాని తెలిపింది. అందుకే అలా కారులో లాంగ్ డ్రైవ్‌లో హైవేపై దూసుకుపోతోంది. జైల్లో నుంచి ఖైదీ బయట పడ్డట్టు, పంజరంలోంచి పక్షి బయట పడ్డట్టు తమన్నా ప్రస్తుతం స్వేచ్చగా తిరుగుతోంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సీటీమార్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు.