మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సీటీ మార్ సెట్‌లో బిజీగా ఉంది. అంతుకు ముందు గుర్తుందా శీతాకాలం షూటింగ్‌లో రచ్చ చేసింది. అక్కడ హీరో, దర్శకులతో తమన్నా, తన టీం ఎంత అల్లరి చేసిందో అందరికీతెలిసిందే.ఏకంగా డైరెక్టర్‌నే పానీ పూరి బండి పెట్టేలా చేసేశారు. హీరోయిన్, ఆమె ఫ్రెండ్స్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అలా పానీ పూరి తినిపించాల్సి వచ్చిందట. మొత్తానికి తమన్నా సెట్‌లో ఉంటే మాత్రం సందడే సందడి.
అలా ప్రస్తుతం తమన్నా సీటీమార్ సెట్‌లో రచ్చ చేస్తోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. గోపీచంద్ సైతం కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఆ మధ్య తమన్నాకు కరోనా రావడంతో షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఇక కరోనా తగ్గిన వెంటనే తమన్నా సెట్‌లో జాయిన్ అయింది. ఆమధ్య సెట్‌లో బస్ నడిపి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా సెట్‌లో జాయిన్ అయిన తమన్నా అక్కడి వారితో కలిసి రచ్చ చేసింది. ఇందులో అమ్మాయిల కబడ్డి నేపథ్యంలో కొన్ని సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇందులో కొందరు సెట్‌లో ఓ సైడ్ కూర్చొని ఏదో ఆటలు ఆటడుతున్నారు. అలాసెట్‌లో అల్లరి చేస్తున్న వారిని తమన్నా బెదిరింది. అసలు మీరు ఏం చేస్తున్నారు.. ఏం ఆట ఆడుతున్నారు. బోండాలు వేస్తున్నారా? ఆటలు ఆడుతున్నారా? అంటూ కౌంటర్ వేసింది. దీంతో వారు చేసిన యాక్టింగ్ మరీ చెత్తగా ఉందని కామెంట్లు చేసింది.