అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోందని ఫిల్మ్ నగర్ టాక్. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ తన కెరీర్‌ను మరో మెరుగైన స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. తొలుత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉండగా, అది కొంత ఆలస్యమవుతుందనే సంకేతాలు రావడంతో అట్లీ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాకి మరో సీనియర్ హీరో కూడా జతకానున్నారని టాక్.
ఈ కథను అట్లీ మొదట బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కానీ కొన్ని అనివార్య కారణాలతో సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, అట్లీ వెంటనే అల్లు అర్జున్‌ను సంప్రదించారని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథ విన్న బన్నీ వెంటనే ఓకే చెప్పడంతో, ఇప్పుడు ప్రాజెక్ట్ వేగంగా ఫైనల్ అవుతోంది. అయితే ఈ చిత్రంలో బన్నీతో పాటు మరో హీరోకి స్కోప్ ఉందని, ఆ పాత్ర కోసం కోలీవుడ్ నుంచి ఓ స్టార్ నటుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నారని సమాచారం.
లేటెస్ట్‌గా ఈ పాత్రకు శివకార్తికేయన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ‘పరశక్తి’ చిత్రంతో బిజీగా ఉన్న ఈ హీరో, మే నాటికి తన షెడ్యూల్ క్లియర్ చేసుకోవాలని చూస్తున్నట్లు టాక్. దీనికి కారణం, అట్లీ ప్రాజెక్ట్‌లో బన్నీతో కలిసి నటించే అవకాశం రావడం కావొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శివకార్తికేయన్ మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే నటుడిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆయనతో కలిసి అల్లు అర్జున్ స్క్రీన్ షేర్ చేసుకుంటే సినిమా బిగ్గెస్ట్ హైప్ క్రియేట్ అవుతుందనడంలో సందేహమే లేదు.
ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇద్దరు స్ట్రాంగ్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే, ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఖాయం. అల్లు అర్జున్ తన మాస్ స్టైల్‌తో, శివకార్తికేయన్ తన కామెడీ టైమింగ్, నటనతో ఓ రేంజ్‌లో సందడి చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తమిళ, తెలుగు భాషల్లో హైపైన పాన్ ఇండియా మూవీగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.