అమెరికా చెన్నైలో దులిపేసిన త‌లైవా

సూపర్ స్టార్ రజినీకాంత్- మురుగ‌దాస్ క్రేజీ కాంబినేష‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఓపెనింగుల‌కు పెద్ద ఎత్తున వ‌ర్క‌వుటైంద‌ని తెలుస్తోంది. ఈ జోడీ నుంచి వ‌చ్చిన ద‌ర్బార్ తొలి రోజు ప‌లుచోట్ల బాక్సాఫీస్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ముఖ్యంగా త‌మిళ‌నాడు స‌హా చెన్నై మెట్రోలో అలాగే అమెరికాలోనూ ద‌ర్బార్ వ‌సూళ్లు అద‌ర‌గొట్టింద‌ని తెలుస్తోంది. ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం ఓపెనింగుల ప‌రంగా త‌లైవా కెరీర్ బెస్ట్ గా నిలుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు నాట మాత్రం సోసోనే. రివ్యూల ప‌రంగా యావ‌రేజ్ రేటింగులే ఇవ్వ‌డం ఇక్క‌డ పెద్ద మైన‌స్ గా మార‌నుందని అంచ‌నా వేస్తున్నారు.

తొలి రోజు సాయంత్రానికి.. దర్బార్ తమిళ వర్షన్ ఒక్కటే అమెరికా బాక్సాఫీస్ నుంచి 6.15 లక్షల డాలర్ల వసూలు చేయ‌గా.. చెన్నై సిటీలో కూడా దర్బార్ మొదటిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. చెన్నై సిటీలో దర్బార్ 2.27 కోట్లు రాబట్టింది. రజిని ఫ్యాన్స్ కి నచ్చే మాస్ మ‌సాలా క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మిది.ఈ చిత్రంలో ర‌జ‌నీ పోలీస్ అధికారి పాత్ర చేశారు. ఇక హీరోయిన్ నివేదా థామస్ రజిని కూతురిగా సినిమాకు కీలకమైన పాత్ర‌లో న‌టించింది. నయనతార హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్ల‌స్ అయ్యింద‌న్న టాక్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వ‌సూళ్ల వివ‌రాలు స‌హా త‌మిళ‌నాడు బాక్సాఫీస్ వివ‌రాలు తెలియాల్సి ఉంది.